ఇండియన్ అమెరికన్ సింగర్ ఫాల్గుణి షా తన కెరీర్ లో మొదటి గ్రామి అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. గ్రామి అవార్డుల్లో బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డును పొందినందుకు ఫాల్గుణి షాకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
భవిష్యత్ లో ఇలాంటి అవార్డులను మరిన్ని గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇండో అమెరికన్ సింగర్ ఫాల్గుణి షా ‘ ఫాలు’ స్టేజ్ నేమ్ తో బాగా పాపులర్ అయ్యారు.
ఆమె పాడిన ‘ ఏ కలర్ ఫుల్ వరల్డ్’ కు గ్రామి అవార్డుల్లో బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో అవార్డును ఆదివారం అందజేశారు. ఇక మరో మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కు న్యూ ఆల్బమ్ కేటగిరిలో ‘ డివైన్ టైడ్స్’ అనే ఆల్బమ్ కు గ్రామి అవార్డు లభించింది.
రికీ కేజ్ కు ఈ గ్రామి అవార్డు రెండోది కావడం విశేషం. దీనిపై ఆయన్ని ప్రధాని మోడీ అభినందించారు. ‘ ఈ అద్భుతమైన విజయానికి మీకు అభినందనలు. మీ భవిష్యత్ ప్రయత్నాలు ఫలించాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని ట్వీట్ చేశారు.