భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాధిపతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ‘నెహిబర్ హుడ్ ఫస్ట్’ పాలసీకి కట్టుబడి ఉందని చెప్పారు. భూటాన్, శ్రీలంక, మాల్దీవ్ లు, బంగ్లాదేశ్, నేపాల్ దేశాధినేతలో మాట్లాడిన ప్రధాన మంత్రి పొరుగు దేశాల్లో శాంతి, సామరస్యం, భద్రతపై తన భవిష్య త్ ప్రణాళికను పంచుకున్నారు. అయితే ప్రధాని మాట్లాడిన పొరుగుదేశాధినేతల్లో పాకిస్థాన్ పేరు మాత్రం లేదు.
గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్ పుల్వామాలో పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఆత్మాహుతి దళ సభ్యడు 40 మంది భారతీయ జవాన్లను హతమర్చాడు. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరంపై భారత ఆర్మీ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్-ఇండియాల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తో అది మరింత దూరమైంది.
తాజాగా కొత్తగా ఆర్మీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎం.ఎం.నర్వానే పాకిస్థాన్ పై భారత వైఖరేంటో స్పష్టంగానే చెప్పారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే హక్కు ఉందని ప్రభుత్వ వైఖరిని చెప్పకనే చెప్పారు.