హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుకేత్ ఖాద్ వద్ద ఓ వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.
ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్లర్ వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. ‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో రోడ్డు ప్రమాదం జరిగిందన్న తెలిసి ఆవేదనకు లోనయ్యాను ప్రభుత్వం సహాయక కార్యకలాపాల్లో నిమగ్నమైంది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.