పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ, బీహార్ సోదరులను పంజాబ్ రానివ్వకండి అంటూ చన్నీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టిన ప్రియాంక వాద్రాపైనా ప్రధాని మోడీ విమర్శలు చేశారు.
‘ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చన్నీ ఏం అన్నారో చూశాము. ఢిల్లీకి చెందిన కుటుంబం ఈ వ్యాఖ్యలకు ఎలా చప్పట్లు కొట్టారో మనం గమనించాం. ఈ మొత్తం ఘటనను దేశం మొత్తం చూసింది” అని అన్నారు.
‘ గురు గోవింద్ సింగ్ ఎక్కడ పుట్టారు?. బిహార్ లోని పాట్నా సాహిబ్ కాదా?. గురు గోవింద్ సింగ్ నూ పంజాబ్ నుంచి గెంటేస్తారా. ఇలాంటి విభజన మనస్తత్వం ఉన్న వ్యక్తులను పంజాబ్‌ను ఒక్క క్షణం పాలించనివ్వకూడదు’’ అని పేర్కొన్నారు.
‘నిన్న మనం గురు రవిదాస్ జయంతిని జరుపుకున్నాం. ఆయన ఎక్కడ జన్మించారు?. ఉత్తర ప్రదేశ్ అన్న విషయం మరిచిపోయారా. గురు రవిదాస్ ను పంజాబ్ నుంచి తొలగిస్తారా” అంటూ ధ్వజమెత్తారు.