వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే దిశగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ వ్యవస్థను ఉపయోగించేలా ఓ పథకానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు, ఎరువులు చల్లేందుకు, వ్యవసాయ సంబంధిత పనిముట్లును మోసుకుపోయేందుకు కిసాన్ డ్రోన్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 100 కిసాన్ డ్రోన్లను ఏక కాలంలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘ ఇది 21 వ శతాబ్దంలో నూతన వ్యవసాయ సౌకర్యాలను కల్పించే దిశగా నూతన అధ్యయనం. ఈ ప్రారంభం డ్రోన్ సెక్టార్ అభివృద్ధిలో ఒక మైలు రాయిగా మిగిలి పోతుంది” అని అన్నారు.
‘ ప్రస్తుతం దేశంలో డ్రోన్ స్టార్టప్‌ల కొత్త సంస్కృతి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేసే వారి సంఖ్య 200 వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఇది వేలల్లోకి చేరుతుంది. దీని వల్ల త్వరలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కలుగుతాయి” అని తెలిపారు.
‘ డ్రోన్ సెక్టా్ర్ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలూ కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రంగంలో అభివృద్దిని సులభతరం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు సంస్కరణలు, పథకాలు, చర్యలు చేపడుతున్నాము” అని వెల్లడించారు.