వలస కార్మికులకు ప్రధాని మోదీ భారీ ప్రయోజనాన్ని కల్పించారు. ఉజ్వల 2.0 పథకం కింద రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ లేకున్నా.. వారి కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉచితంగా కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ఆయన తెలిపారు. గ్యాస్ కనెక్షన్ కావాల్సిన వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. అలాంటి వారిపట్ల ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు.
2016లో ప్రారంభించిన ఉజ్వల పథక మొదటి దశలో ఇప్పటికే 8 కోట్ల మంది పేద కుటుంబాలు లబ్ధిపొందాయని ప్రధాని గుర్తు చేశారు. అర్హత ఉన్నా.. అప్పుడు గ్యాస్ కనెక్షన్ పొందనివారికి ఇప్పుడు అందజేస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు ఫ్రీ సిలిండర్‌తో పాటు స్టౌవ్ కూడా అందజేయనున్నారు.