ప్రపంచ అరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్ కు ప్రధాని మోడీ కొత్త పేరు పెట్టారు. తన గుజరాత్ పర్యటనలో భాగంగా మూడో రోజు ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమావేశాన్ని ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాత్, డబ్ల్యూహెచ్‌ఓ డీజీ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అథనోమ్ గుజరాతీలో మాట్లాడారు.
మొదట ఆయన నమస్కార్ అంటూ మొదలు పెట్టారు. ఆ తర్వాత కెమ్చూ( ఎలా ఉన్నారు) అని సభలో ఉన్న వారిని అడిగారు. దీంతో అందరూ చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు.
ఆ తర్వాత మాట్లాడిన మోడీ…. ఇక నుంచి నిన్ను తులసీ భాయ్ అంటూ పిలుస్తానని సరదాగా అథనోమ్ ను ఉద్దేశించి మోడీ అన్నారు. టెడ్రోస్ తనకు చాలా మంచి స్నేహితుడని మోడీ తెలిపారు.
Advertisements
తనకు భారత్ కు చెందిన ఉపాధ్యాయుడే విద్యను బోధించాడని టెడ్రోస్ తనతో అన్నారని మోడీ చెప్పారు. తాను పక్కా గుజరాతీ అయిపోయానని, తనకు గుజరాతీ పేరును పెట్టాలని అథనోమ్ తనను కోరారని మోడీ పేర్కొన్నారు. దీంతో ఆయనకు తులసీ భాయ్ అని నామకరణం చేస్తున్నట్టు మోడీ అన్నారు.