1998 పోఖ్రాన్ అణుపరీక్షలను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా 1998లో పోఖ్రాన్ పరీక్షలను సక్సెస్ చేసిన మేధావులైన శాస్త్రవేత్తలకు, వారి ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు.
అత్యుత్తమ రాజకీయ ధైర్యం, రాజనీతిజ్ఞతను కనబరిచిన మాజీ ప్రధాని అటల్ జీ ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని తాము గర్వంగా స్మరించుకుంటామని అన్నారు.
ట్వీట్ తో పాటు పోఖ్రాన్ అణుపరీక్షలకు సంబంధించిన షార్ట్ వీడియోన్ ఆయన పోస్టు చేశారు. 1998 మే 11న రాజస్థాన్ లోని పోఖ్రాన్ ప్రాంతంలో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అప్పటి నుంచి మే 11ను సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.