నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలను రెండు దేశాల నేతలు సమీక్షించారు.
ఇరు దేశాల మధ్య అభివృద్ధి సహకారాన్ని మరింతగా పెంచే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.
‘ నార్వేతో స్నేహం బలపడుతోంది. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, జోనాస్ గహర్ స్టోర్ లు కోపెన్ హగన్ లో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సంబంధాలను, అభివృద్ధి సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలను రెండు దేశాల ప్రధానులు పరిశీలిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే ప్రధానమంత్రులతో కలిసి 2వ ఇండియా-నార్డిక్ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతారు, మొదటి ఇండియా-నార్డిక్ సమావేశం 2018 తర్వాత ఆయాదేశాల మధ్య సహకారంపై సమీక్షిస్తారు.