రెండు రోజుల జపాన్ పర్యటనను ముగించుకుని ప్రధాని మోడీ బుధవారం భారత్ కు చేరుకున్నారు. భారత్ కు వచ్చీ రాగానే కేబినెట్ సమావేశాన్ని ప్రధాని మోడీ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజీజు, స్మృతి ఇరానీలు హాజరయ్యారు.
ఈ సమావేశానికి ప్రధాన ఎజెండా ఏంటన్నదానిపై స్పష్టంగా తెలియడం లేదు. క్వాడ్ సమావేశం నుంచి రావడంతో అక్కడ జరిగిన విషయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన ప్రధాని అక్కడి వ్యాపార వేత్తలు, ప్రవాసీ భారతీయులతో సమావేశం అయ్యారు. అనంతరం క్వాడ్ సమావేశంలో పాల్గొన్నారు .