డిజిటల్ ఇండియా ద్వారా పాలనలో మెరుగైన ఆవిష్కరణలు చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరం కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారాయన. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.
డిజిటల్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్ల మన దేశం ఈ రంగంలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందన్నారు ప్రధాని. దేశంలో 690 మిలియన్ల రూపే కార్డులు జారీ అయ్యాయని.. గతేడాది వాటి ద్వారా 1.3 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఫిన్‌టెక్ కార్యక్రమాలను విప్లవంగా మార్చే సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు మోడీ.