ఉజ్జయినిలో ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం మహాకాళేశ్వర్ కారిడార్ మొదటి దశను ఈ ఆలయంలో ప్రారంభించారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మహాకాళేశ్వర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. అంతకు ముందు మోడీ ఈ గుడిలో పూజలు చేశారు. సంప్రదాయబద్ధమైన ధోతీ, గంప్చీ ధరించిన ఆయన ఆరు గంటల ప్రాంతంలో గర్భగుడిలో ప్రవేశించారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆయన వెంట ఉన్నారు. ఈ కారిడార్ లో వరుసగా ఇసుకరాయితో చేసిన 108 శివ కళారూపాలు ఉన్నాయి. శివ పురాణం నుంచి సేకరించిన కథనాలతో కూడిన 53 ముద్రలు, త్రిశూల శిలాకృతులతో అద్భుతంగా ఈ కారిడార్ ను మలిచారు.
మొదటి దశలో ఇక్కడికి వచ్చే భక్తులు, యాత్రికుల కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు సమకూర్చినట్టు ఈ ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. పండితులు శివ స్త్రోత్రాన్ని పఠిస్తుండగా మోడీ ఈ కారిడార్ ను ప్రారంభించడం విశేషం, తొలిదశ నిర్మాణానికి రూ. 850 కోట్లు వ్యయమయినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి.
రెండో దశను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. మహాకాల్ పథ్ అని వ్యవహరిస్తున్న చోట 108 స్తంభాలు, శివ తాండవ కళా శిల్పాలు ఉన్నాయి. 2.5 హెక్టార్ల విస్తీర్ణంలో గల ‘ప్లాజా ఏరియా’ చుట్టూ లోటస్ పాండ్, ఫౌంటైన్లు ఉండడం అదనపు ఆకర్షణ. ఈ మొత్తం ప్రదేశాన్నంతా 24 గంటలూ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ అధునాతన కెమెరాలతో పర్యవేక్షిస్తుంటాయి.
#WATCH | Ujjain, MP: PM dedicates to the nation Shri Mahakal Lok. Phase I of the project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities
Total cost of the entire project is around Rs 850 cr.
(Source: DD) pic.twitter.com/J1UnlU9XLa
— ANI (@ANI) October 11, 2022