పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మెట్రో రైలు టికెట్ కొని విద్యార్థులతో కలిసి గర్వేర్ మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ వరకు ప్రయాణించారు.
‘ పూణే వాసులకు మెట్రో ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది” అంటూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ప్రాజక్టుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకుంది. ‘ ఈ ప్రాజెక్టు 32.2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని రూ.11,400 కోట్లతో నిర్మిస్తున్నాము’ అని పీఎంవో వెల్లడించింది.
అంతకు ముందు పూణే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. దీన్ని 9 ఫీట్ల ఎత్తులో, 1850 కేజీల గన్ మెటల్ తో తయారు చేశారు.