దేశంలో కరోనా వైరస్ పోరాటానికి లాక్ డౌన్ పొడిగింపు తప్పదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు కొనసాగిన లాక్ డౌన్ కు, ఇక లాక్ డౌన్ 4.0కు భారీ తేడా ఉంటుందని మోడీ తేల్చి చెప్పారు.
అయితే, లాక్ డౌన్ పై కొత్త నిబంధనలు ఉంటాయని ప్రధాని చెప్పినప్పటికీ… ఆ నిబంధనలు అనేవి మే 18కన్నా ముందే భారత ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. ఇక నుండి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిబంధనలు ఉంటాయని మోడీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తన ప్రసంగంలో తేల్చి చెప్పారు.