దేశంలోని ప్రతి పౌరుడి కలలు, ఆకాంక్షల విషయంలో ప్రధాని మోడీ కొత్త విశ్వాసాన్ని నింపారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోడీ సర్కార్ ఎనిమిదేండ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఎనిమిదేండ్ల పాలనలో మోడీ ప్రభుత్వం అనేక చారిత్రక విజయాలను సాధించిందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీనవర్గాలకు హక్కులను ప్రధాని మోడీ కల్పించారని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై వారిలో విశ్వాసాన్ని నింపిందని తెలిపారు. వారంతా దేశ అభివృద్ధిలో ఇప్పుడు భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.
ప్రధాని తన సమర్ధవంతమైన నాయకత్వం, దృఢ సంకల్పంతో దేశాన్ని సురక్షితంగా మార్చడమే కాకుండా, ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇది ప్రతి పౌరున్ని గర్వంతో తల ఎత్తుకునేలా చేసిందని ఆయన అన్నారు.