రిపబ్లిక్‌డే రోజు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. ఎర్రకోటపై త్రివర్ణపతాకానికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ఘటనతో దేశం దిగ్భ్రాంతి చెందిందని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని. కలిసికట్టుగా కష్టపడినందునే ఆ విజయం సాధ్యమైందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమేగాక, వ్యాక్సినేషన్‌లో పక్కదేశాలకు కూడా సాయం చేస్తోందని తెలిపారు.
దేశంలోని కవులు, రచయితలు.. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం, త్యాగాల గురించి రచనలు చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని. ఇక ఇటీవల దేశానికి చెందిన నలుగురు మహిళా పైలెట్లు అమెరికా నుంచి బెంగళూరుకు విమానాన్ని నడిపి.. మహిళల శక్తిని మరోసారి ప్రపంచానికి చాటారని అన్నారు ప్రధాని.