అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బిజీబిజీగా ఉన్నారు. మొదటిరోజు పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. తొలుత క్వాల్కమ్ సీఈవో క్రిస్టియానో అమన్ తో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి మోడీ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా భారత్ తో 5జీ టెక్నాలజీతో పాటు డిజిటల్ కార్యక్రమాల్లో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు క్రిస్టియానో అమన్ తెలిపారు. క్వాల్కమ్ భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు మోడీ.
అనంతరం అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ తో భేటీ అయ్యారు ప్రధాని. భారత్ దేశానికి అడోబ్ గొప్ప ఫ్రెండ్ అని కొనియాడారు. ఎడ్ టెక్, భారతీయ స్టార్టప్ లకు కు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
అనంతరం ఫస్ట్ సోలార్ సంస్థ సీఈఓ మార్క్ విడ్ మర్ తో చర్చలు జరిపారు మోడీ. భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించారు.
జనరల్ ఎటామిక్స్ కంపెనీ వివేక్ లాల్ తో భేటీ అయ్యారు మోడీ. డ్రోన్స్ పాలసీ సహా పలు అంశాలపై మాట్లాడారు.
ఆ తర్వాత బ్లాక్ స్టోక్ కంపెనీ సీఈవో స్టీఫెన్ స్క్వార్జ్ మన్ ను కలిశారు. భారతదేశంలో పెట్టుబడల అంశంపై చర్చించారు.