కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ కు మరో స్వర్ణం లభించింది. పురుషుల 73 కేజీల విభాగంలో ఫైనల్ లో అచింత షూలి బంగారు పతకాన్ని సాధించాడు.
ఈ విజయంపై షూలీని పలువురు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖులు షూలీని ప్రశంల్లో ముంచెత్తారు.
కామన్వెల్త్ క్రీడలకు వెళ్లే ముందు క్రీడాకారులతో ప్రధాని మోడీ వీడియో కాన్షరెన్స్ లో మాట్లాడారు. ఆ సందర్బంగా అచింతతో ప్రధాని మోడీ సంభాషించారు. ఆ సంభాషణను మోడీ తాజాగా గుర్తు చేసుకుంటు ట్వీట్ చేశారు.
కామన్వెల్త్ క్రీడలకు వెళ్లే ముందు క్రీడాకారుల బృందంతో మాట్లాడానని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ సమయంలో అచింత షూలీతోనూ సంభాషించానని తెలిపారు.
అచింతకు ఆయన తల్లి, సోదరుని నుంచి లభించిన మద్దతు గురించి తమకు వివరించారని చెప్పారు.
ఆ సమయంలో అతనికి సినిమాలంటే ఇష్టమని అచింత వెల్లడించాడని అన్నారు. ఇక ఇప్పుడు అచింతకు సమయం దొరికిందని, ఇక ఇప్పుడు సినిమాలు చూసుకోవచ్చని ట్వీట్ చేశారు.