ప్రధాని మోడీతో భారత బ్యాడ్మింటన్ బృందం ఆదివారం భేటీ అయింది. ఇటీవల థామస్ కప్‌ను గెలవడంపై క్రీడాకారులను ప్రధాని మోడీ ఈ సందర్బంగా అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధాని మోడీతో పంచుకున్నారు.
ఈ భేటీపై బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ చాలా బిజీగా ఉన్నప్పటికీ తమను కలిసేందుకు సమయం కేటాయించడం గొప్ప విషయం అన్నారు. మేము సాధించిన విజయాల పట్ల మమ్మల్ని అభినందించారు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఆటగాళ్లకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు.
‘ క్రీడాకారులను, క్రీడలను ప్రధాని మోడీ అనుసరిస్తున్నారు. ఆయన ఆలోచనలు క్రీడకారులతో ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటాయి. క్రీడాకారులతో ప్రధాని నేరుగా మాట్లాడటాన్ని నేను గత ఎనిమిదేండ్లుగా చూస్తున్నాను. క్రీడాకారులు పథకం గెలుస్తారా అనే దానితో సంబంధం లేకుండా ఆయన అందరినీ ప్రోత్సహిస్తున్నారు’ అని పుల్లెల గోపి చంద్ అన్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులను ప్రధాని మోడీ అభినందించారు. క్రీడాకారులను భారత్ తరఫున తాను అభినందిస్తున్నానని తెలిపారు. దశాబ్దాల తర్వాత థామస్ కప్ లో భారత్ విజయపతాకాన్ని ఎగురవేసిందన్నారు. ఈ విజయం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.