భారత్, రష్యా మధ్య స్నేహబంధం ఎప్పటికీ మారదని ప్రధాని మోడీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ ఢిల్లీలో భేటీ అయ్యారు. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అయినా భారత్, రష్యాల స్నేహం మారలేదని చెప్పారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ. ఇక స్నేహబంధాన్ని కొనసాగించడంలో ప్రపంచ దేశాలకు భారత్, చైనా ఆదర్శంగా ఉంటాయన్నారు పుతిన్. తాము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, మిత్ర దేశంగా భావిస్తున్నామని తెలిపారు.