దేశంలో కరోనా వైరస్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తుండటంతో.. కట్టడి చర్యలపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మహమ్మారి నియంత్రణ కోసం అనుసరించాల్సిన ఐదంచెల వ్యూహాన్ని అధికారులకు వివరించారు. ఇప్పటిదాకా కరోనా నియంత్రణ కోసం టెస్ట్, ట్రేస్, ట్రీట్ (3T’s) విధానాన్ని దేశంలో అనుసరిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని ఈ విధానానికి మరో రెండు ప్రక్రియలను జోడించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్‌తో పాటు వ్యాక్సినేషన్, కరోనా గైడ్లైన్స్ కూడా పక్కాగా పాటించాలని ఆదేశించారు.
కరోనా వైరస్‌పై ప్రజలకు మరోసారి విస్తృతంగా అవగాహన కల్పించేందుకు. స్పెషల్ క్యాంపెయినింగ్ చేపట్టాలని ప్రధాని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ప్రజలు 100 శాతం మాస్కులను వినియోగించడంతో పాటు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఇక జనం సంచరించే ప్రాంతాలు, ఆరోగ్య కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు.
మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్‌తో పాటు కరోనా తీవ్రత అధింగా ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్ టీమ్స్ ను పంపాలని ప్రధాని ఆదేశించారు. దేశంలో వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగేందుకు.. ఉత్పత్తి పెంచేలా డొమెస్టిక్, ఫారిన్ కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నట్టు మోదీ వివరించారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆదివారం నిర్వహించిన హైలెవెల్ మీటింగ్ లో తాజా సూచనలు చేశారు ప్రధాని.