గురు రవిదాస్ 645వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలోని కరోల్ బాగ్ లో పర్యటించారు. అక్కడ రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి వెళ్లారు. షాబాద్ కీర్తన్ లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కాసేపు కచేరి చేశారు. కీర్తనలను ఆలపించారు.
గురు రవిదాస్ తన జీవితాన్ని సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు అంకితం చేశారని మోడీ ప్రశంసించారు. అంటరానితనంపై పోరాడారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఆయన స్ఫూర్తితోనే అమలు చేస్తోందని వివరించారు.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022
ఇటు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీ యూపీలోని వారణాసి దగ్గర రవిదాస్ జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఉదయం 4 గంటలకే ఆలయానికి వెళ్లిన ఆయన.. 45 నిమిషాల పాటు కీర్తనల్లో పాల్గొన్నారు.
గురు రవిదాస్ 1377లో వారణాసిలోని మందౌధి దగ్గర మాఘ పూర్ణిమ రోజున జన్మించారు. ఆయన కవి, సామాజిక సంస్కర్త, ఆధ్మాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. కీర్తనలు, ఆధ్యాత్మిక బోధనలతో భక్తి ఉద్యమాన్ని నడిపారు. సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్ లో 40 పద్యాలు రాశారు.