పాకిస్తాన్ ఉగ్రవాదం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాని మోడీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య చర్చలు జరిగాయి. అయితే మీటింగ్ అనంతరం ఆమెకు మోడీ కొన్ని బహుమతులను అందజేశారు. వాటిలో గులాబీ మీనకారి చెస్ సెట్ గిఫ్ట్ ఎంతో ప్రత్యేకం. పురాతన నగరాల్లో ఒకటైన కాశీ హస్తకళను ప్రతిబింబించేలా ఇది ఉంది. అందులోని ప్రతీ భాగం అద్భుతంగా రూపొందించారు.
ఇంకో బహుమతితో కమలా హ్యారిస్ కు తన తాతను గుర్తు చేశారు మోడీ. పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన చెక్క జ్ఞాపికను బహుమతిగా అందించారు.
ఇక ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ కు సిల్వర్ గులాబీ మీనాకారీ నౌకను బహుమతిగా ఇచ్చారు మోడీ. కాశీ విశిష్టత ఉట్టిపడేలా ఉన్న హస్తకళా నైపుణ్యంతో ఈ నౌక ఉంది.
అలాగే జపాన్ ప్రధాని సుగకు గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహాన్ని మోడీ బహూకరించారు.