ప్రధాని మోడీ
– ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ
– దేశ ప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయి
– సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
– 8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం
– దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చింది
– తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోంది
– మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నాం
– హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నాం
– బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి
– తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి
– రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం
– దేశంలో ఎరువుల కొరత తీరుతుంది
– 2019 ఎన్నికల నుంచి బీజేపీ తెలంగాణలో బలపడుతోంది
– జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది
– డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు
– కరోనా సమయంలో తెలంగాణ ప్రజలకు ఎన్నో చేశాం
– ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం
– తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది
జేపీ నడ్డా
– జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చింది
– రఘునందన్, ఈటల విజయం.. బీజేపీ అధికారంలోకి వస్తుందనేందుకు సూచన
– కేసీఆర్ అవినీతి, అక్రమాలు చూసి ప్రజలు విసిగిపోయారు
– కేసీఆర్‌ను దింపి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు
– కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారు
– టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప మరొకరికి చోటులేదు
– తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి
– ప్రియతమ నేత మోడీని చూసేందుకు ఇంతమంది పోటెత్తారు
– తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం.. బీజేపీ పాలన రావడం ఖాయం
– తెలంగాణ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
– పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయి- బండి సంజయ్
– తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది- బండి సంజయ్
– రాజకీయ లబ్ధి కోసమే మోడీని కేసీఆర్ తిడుతున్నారు- బండి సంజయ్
– మోడీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలి- బండి సంజయ్
– కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా?- బండి సంజయ్
– పేద ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా?- బండి సంజయ్
– ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా?- బండి సంజయ్
– ప్రధాని మోడీపై టీఆర్ఎస్ నేతల విమర్శలు చూస్తే బాధగా ఉంది- బండి సంజయ్
– వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం- అమిత్‌షా
– ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతాం- అమిత్ షా
– కేటీఆర్ ను ఎలా సీఎం చేయాలనేదే కేసీఆర్ ఆలోచన- అమిత్ షా
– తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం- అమిత్ షా
– పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ సభ
– సభా వేదికగా బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి
– కొండాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జేపీ నడ్డా