టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పలు అవార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఆస్కార్ నామినేషన్ లోనూ చోటు దక్కించుకున్న ఈ సినిమా.. ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇప్పటికే ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబల్ అవార్డు రాగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ ఫంక్షన్ లో చూసినా ఇదే పాట మారుమ్రోగుతుంది.
ఇక ఇంటర్నేషనల్ గా కూడా సెన్సేషనల్ హిట్ అయిన ఈ సాంగ్ పై కొరియన్స్ కవర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోని కొరియ ఎంబసీ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ‘ఇది చూడడానికి చాలా బావుంది. ఒరిజినల్ సాంగ్ కి దగ్గరగా ఉంది’ అంటూ ప్రశంసించారు.
𝐍𝐚𝐚𝐭𝐮 𝐍𝐚𝐚𝐭𝐮 𝐑𝐑𝐑 𝐃𝐚𝐧𝐜𝐞 𝐂𝐨𝐯𝐞𝐫 – 𝐊𝐨𝐫𝐞𝐚𝐧 𝐄𝐦𝐛𝐚𝐬𝐬𝐲 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚
Do you know Naatu?
We are happy to share with you the Korean Embassy’s Naatu Naatu dance cover. See the Korean Ambassador Chang Jae-bok along with the embassy staff Naatu Naatu!! pic.twitter.com/r2GQgN9fwC
— Korea Embassy India (@RokEmbIndia) February 25, 2023