శ్రీనగర్ ను సందర్శించాలంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు చేసిన ట్వీట్ పై ప్రధాని మోడీ స్పందించారు. రంజిత్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ కు ప్రధాని మోడీ బదులిచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
శ్రీనగర్ అందాలను వివరిస్తూ కశ్మీర్ ను ఓ సారి సందర్శించాలంటూ ట్విట్టర్ యూజర్ రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రధాని మోడీని కోరారు. దానిపై స్పందించిన మోడీ.. శ్రీనగర్ ఓ అద్భుతమన్నారు. 2019లో తాను శ్రీనగర్‌ను సందర్శించినప్పటి ఫోటోను షేర్ చేస్తూ తాను కూడా టెంప్ట్ అయ్యానన్నారు.
2019లో శ్రీనగర్ పర్యటన సందర్బంగా దాల్ లేక్ పక్కన నిల్చుని దిగిన ఫోటోను ప్రధాని ఈ సందర్బంగా షేర్ చేశారు. రంజిత్ కుమార్ ఇటీవల కశ్మీర్ లోయను సందర్శించారు. ఆ సమయంలో ఆయన దిగిన పోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు.
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కశ్మీర్ సందర్శించానని రంజిత్ కుమార్ అన్నారు. 45 ఏండ్ల తర్వాత మళ్లీ అక్కడికి వచ్చానన్నారు. కశ్మీర్ లోని బైసరన్, అరు, కోకెర్‌నాగ్, అచ్‌బల్, గుల్‌మార్గ్, శ్రీనగర్ వంటి ప్రదేశాలు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నాయన్నారు.
దాల్ సరస్సులోని చార్ చినార్‌లో మాత్రమే ఒక పాత చినార్ చెట్టు ఉందన్నారు. ప్రజలకు అదే వెచ్చదనాన్ని చెట్టు ఇంకా ఇస్తోందన్నారు. ప్రధాని మోడీ ఒకసారి ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించండి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
జమ్మ, కశ్మీర్‌ను ఇటీవల రికార్డు స్థాయిలో పర్యాటకులు సందర్శించడంపై ప్రశంసిస్తు ప్రధాని మోడీ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా రంజిత్ కుమార్ ఈ ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని మోడీ స్పందించి తన కశ్మీర్ పర్యటన నాటి ఫోటోను షేర్ చేశారు.