తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ట్వీట్‌ను కూడా తెలుగులోనే చేసి ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్విట్‌లో చెప్పుకొచ్చారు.
గతంలో కూడా పలు సందర్భాల్లో నాలుగైదు సార్లు, తెలుగులో ట్వీట్ చేశారు మోదీ. పండగ వేళ మోదీ చేసిన ట్వీట్ ఇదే
Bhogi greetings to everyone. I pray that this special day fills everyone’s lives with happiness and good health.
అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) January 13, 2021