సులభతర వ్యాపారం, సులభతర జీవనం ఎంత ముఖ్యమో సులభ తర న్యాయమూ అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో న్యాయసేవల అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇది అజాదీ కా అమృత్ కాలమని అన్నారు. రాబోయే 25 ఏండ్లలో భారత్ ను ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లడానికి దోహదం చేసే నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయమిది అని తెలిపారు.
ఈ ఎనిమిదేండ్లలో న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈకోర్ట్ మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని వివరించారు.
24 గంటలు పనిచేసే న్యాయస్థానాలను కూడా తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రజల సౌకర్యం కోసం న్యాయస్థానాల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలను విస్తృతపరిచామన్నారు.