గ్రహణం చూడలేకపోయానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అందరు భారతీయుల్లాగే తాను కూడా సూర్య గ్రహణాన్ని చూడాలని చాలా ఉత్సాహపడ్డానని..అయితే దురదృష్టవశాత్తు మబ్బులు కమ్మి ఉండడం వల్ల చూడలేకపోయాను అంటూ గ్రహణ సమయంలో ట్విట్టర్ లో తెలిపారు. కానీ కోజికోడ్, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాను..నిపుణులతో మాట్లాడుతూ ఈ విషయంలో తన పరిజ్ఙానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నానని కూడా తెలిపారు. ఈ సందర్భంగా గ్రహణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను మోదీ పోస్ట్ చేశారు.