ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ రిక్షా కార్మికుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. ప్రధాని లోక్ సభ స్థానం వారణాసిలో తాను దత్తత తీసుకున్న డ్రోమ్రి గ్రామానికి చెందిన మంగల్ కేవత్ రిక్షా కార్మికుడు. ఈ నెల 12 న అతని కూతురు పెళ్లి ఉండడంతో పెళ్లికి హాజరై తన కూతురును ఆశీర్వదించాల్సిందిగా ప్రధాన మంత్రిని ఆహ్వానించారు. కేవత్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి కార్యాలయంలో శుభలేఖను అందజేశారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ… కేవత్ కూతరుకు, అతని కుటుంబానికి ఆశీర్వాదాలు తెలియజేస్తూ లేఖ రాశారు. ప్రధాని నుంచి అశీర్వాదాలతో లేఖ రావడం వారి కుటుంబంలో ఆనందానికి అవదుల్లేకుండా చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమను ఆశీర్వదిస్తూ లేఖ రాయడం మమ్మల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. సమాజంలో చివరి వ్యక్తిని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించుకుంటారనడానికి ఈ లేఖనే నిదర్శనమన్నారు కేవత్. త్వరలో ఉత్తరప్రదేశ్ లో పర్యటించే ప్రధాన మంత్రిని తాము కలుసుకుంటామని కేవత్ భార్య రేణు దేవి చెప్పారు. ప్రధాన మంత్రిని కలిసి మా కుటుంబం అనుభవిస్తున్న కష్టాలను చెప్పుకుంటామన్నారు.