పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పార్లమెంట్ కొత్త భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఇప్నుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోడీ… పార్లమెంట్ నూతన భవనం దేశంలోని ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని అన్నారు. పార్లమెంట్ నూతన భవనంపై పౌరులు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు. పౌరులు తమ ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్‌తో వీడియోను ‘మై పార్లమెంట్ మై ప్రైడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని కోరారు.
వాటిలో కొన్నింటిని తాను రీ ట్వీట్ చేస్తాని చెప్పారు. ఇది ఇలా వుంటే పార్లమెంట్ నూతన భవనాన్ని సుమారు 15 ఏకరాల్లో త్రిభుజాకారంలో నిర్మించారు. అందులో దిగువ సభ ఛాంబర్ ను జాతీయ పక్షి నెమలి ఆధారంగా రూపొందించారు. రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పువ్వు కమలం ఆధారంగా రూపొందించారు.
ఇక పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభం చేయించాలని కొన్ని పార్టీలు, లోక్ సభ స్పీకర్ ప్రారంభించాలని మరి కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే 20కు పైగా ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా వుంటామని ప్రకటించాయి.