ప్రధాని మోదీ పర్యటన కోసం అయోధ్యలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 5 న రామ మందిరానికి భూమి పూజ చేయనున్న ప్రధాని… తొలుత అక్కడి హనుమన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మోదీ మొత్తం 7 నిమిషాలు పాటు హనుమాన్ మందిర్‌లో ఉంటారు. ఇందులో మూడు నిమిషాల పాటు హనుమాన్ పూజా ఆరాధన నిర్వహిస్తారు. మహంత్ రాజు దాస్ హనుమన్‌గారి పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో రామ మందిరానికి ప్రధాని భూమి పూజ చేస్తారు. ఆయన వేసే తొలి ఇటుకతోనే మందిర నిర్మాణం మొదలవుతుంది.