వారణాసిలో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా ఘాట్ కు చేరుకున్న ప్రధాని.. తర్వాత స్వామి వివేకానంద క్రూయిజ్ షిప్ లో నదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శివ దీపోత్సవం అందర్నీ ఆకట్టుకుంది. దీప కాంతుల్లో గంగా ఘాట్ మెరిసిపోయింది. భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. ఈ కార్యకమ్రంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.