ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న సికింద్రాబాద్ లో వందే భారత్ రైలును ఆయన ప్రారంభించాల్సి ఉంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కానీ, అనూహ్యంగా ప్రధాని టూర్ క్యాన్సిల్ అయింది. ఈమేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పీఎంవో వర్గాలు తెలిపాయి.
కొన్ని అనివార్య కారణాల వలన మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు స్టేట్ బీజేపీ ప్రకటించింది. బిజీ షెడ్యూల్ కారణంగానే వాయిదా పడనట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ తెలంగాణ సోషల్ మీడియాలో మాత్రం మోడీ వస్తున్నారని ఓ ప్రత్యేక వీడియో పోస్ట్ అయి ఉంది. ఇది బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు.
‘‘రూ.7076 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి జనవరి 19న తెలంగాణ విచ్చేయుచున్న ప్రధానమంత్రి గారికి హార్ధిక స్వాగతం’’ అని బీజేపీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో మోడీ ఏఏ ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారో వివరించారు. అయితే.. అనూహ్యంగా మోడీ టూర్ వాయిదా పడింది.