కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశంలో పరిస్థితులు, కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఉన్న సమస్యలపై సీఎంలతో ప్రధాని మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడబోతున్నారు.
సోమవారం మద్యాహ్నం 3గంటల నుండి సీఎంలతో ప్రధాని మాట్లాడనున్నారు. మే 17తో దేశంలో మలివిడత లాక్ డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో సీఎంలు ప్రధానిని ఏం కోరతారు, లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందా…? లాక్ డౌన్ ఎత్తివేసేందుకు రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయా…? అన్న అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం నుండి ప్రత్యేక సహయం కోసం ఎదురు చూస్తున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రం వెంటనే ఆదుకోవాలని కోరుతున్న నేపథ్యంలో… సోమవారం జరగాల్సిన సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.