సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. ప్రధాని తన నివాసంలో సాయంత్రం 5 గంటలకు వారితో మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ తెలిపారు.
ఆ ప్రతినిధి బృందంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉంటారని ఆయన తెలిపారు. కొంత కాలంగా సిక్కు సమాజానికి చెందిన ప్రజలను ప్రధాని మోడీ కలుస్తున్నారు. ఇటీవల తొమ్మిదవ సిక్కు గురువు తేజ్ బహదూర్ జ్ఞాపకార్థం జరిగిన సభలో ఎర్రకోటపై ఆయన ప్రసంగించారు.
గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమావేశాన్ని ప్రధాని మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. గుజరాత్‌లో సంఖ్యాపరంగా బలమైన కులం పాటిదార్ల సంస్థ సర్దార్‌ధామ్, సంఘం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వడానికి “మిషన్ 2026” కింద శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ సమావేశాన్ని ప్రతి రెండేండ్లకోసారి నిర్వహిస్తారు. 2018, 2020లో గాంధీనగర్‌లో మొదటి రెండు శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుత సమావేశం సూరత్‌లో జరుగుతుందని పీఎంవో వెల్లడించింది.