సోమవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేయనుంది కేంద్రం. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు పీఎం కిసాన్ నిధి కింద 9వ విడత నిధులను ప్రధాని మోడీ విడుదల చేయనున్నట్లు తెలిపారు అధికారులు.
దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతులకు రూ.19,500 కోట్లు బదిలీ చేయనుంది కేంద్రం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు.
రైతన్నలకు పెట్టుబడి సాయం కింద.. వారికి చేయూతనిచ్చేందుకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని తీసుకొచ్చారు మోడీ. దీని ద్వారా ఏడాదికి 3 వాయిదాల్లో ఒక్కో రైతుకు రూ.6వేలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.1.38 లక్షల కోట్లను కేంద్రం రైతుల అకౌంట్లలో జమ చేసింది.