ప్రధాని మోదీ రేపు మూడు నగరాల్లో పర్యటిస్తారు. కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న సంస్థలను సందర్శించి టీకా అభివృద్ధి, ఉత్పత్పి జరుగుతున్న తీరునను స్వయంగా సమీక్షంచనున్నారు. ఇందుకోసం ఒకేరోజే అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాలకు వెళ్తారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని సందర్శిస్తారని పీఎంవో కార్యాలయం తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
కరోనా వైరస్‌పై పోరాటంలో పోరాటంలో భారత్ కీలక దశకు చేరుకుందని, వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను సందర్శించి, అక్కడ నిపుణులతో మాట్లాడితే పూర్తి సమచారం తెలుస్తుందని పీఎంవో తన ట్వీట్‌లో తెలిపింది. తద్వారా దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎదురయ్యే సవాళ్లను, కార్యాచరణను తయారు చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అభిప్రాయపడింది.