భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఉదయం నుండి భారీ వర్షం ఉన్నప్పటికీ అమెరికా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద భారీ సంఖ్యలో భారతీయ-అమెరికన్లు కూడా హాజరయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సహా ఇతర ప్రపంచ నాయకులతో చర్చలు జరుపుతారు. క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రసంగించడానికి ఆయన యూఎస్ చేసుకున్నారు.
అయితే ఈ జర్నీలో ప్రధాని మోడీ విమానం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించలేదని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రయాణానికి పీఎం ఫ్లైట్ పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించినట్టు సమాచారం. ఈ మేరకు భారతదేశం పాకిస్తాన్ ను అనుమతి అడగగా ఇస్లామాబాద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని భారతదేశం రద్దు చేసిన తర్వాత 2019 లో విదేశాలకు వెళ్లడానికి పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూడుసార్లు ఉపయోగించుకునేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోడీకి పాకిస్తాన్ గతంలో అనుమతి నిరాకరించింది.
ఇక ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం కరోనా నిర్వహణ, తీవ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణ అంటే భారతదేశాన్ని భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా మార్చాలి, ఇంకా ఈ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ గురించి కూడా చర్చలు జరుగుతాయి. పాకిస్తాన్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ విషయాలు చర్చకు రానున్నాయి. పాకిస్తాన్ లో జరుగుతున్న వ్యవహారాలు ప్రపంచానికి పెద్ద ముప్పు. ద్వైపాక్షిక చర్చలలో చైనా గురించి చర్చలు జరుగుతాయి.