కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కోవాక్జిన్. ఇప్పటికే ఫేజ్-3 ట్రయల్స్ ను విజయవంతంగా సాగిస్తున్న ఈ కోవాక్జిన్ పై భారత్ లో అనేక అంచనాలున్నాయి.
భారత్ లో ఉత్పత్తి అవుతున్న కోవాక్జిన్ తో పాటు జైడస్ క్యాడిలా సంస్థ వ్యాక్సిన్, సీరమ్ సంస్థలో తయారవుతున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తిపై ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తి వంటి కీలక అంశాలతో పాటు పంపిణీ సమస్యలు, రవాణా సమస్యలపై చర్చించారు.
భారత్ బయోటెక్ సందర్శన కోసం హైదరాబాద్ వచ్చిన మోడీ.. ఉత్పత్తిని చూస్తూ, వ్యాక్సిన్ పనితీరు గురించి ఆరా తీశారు. ఒకట్రెండు రోజుల్లో వ్యాక్సినేషన్ పై ప్రధాని కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది.