ప్రధాని మోదీ మరోసారి బీజేపీ ఎంపీలకు క్లాస్ పీకారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీరు తీరు మార్చుకోకపోతే.. మార్పులు తప్పవు” అని బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో స్పష్టం చేశారని తెలుస్తుంది. ఇలా క్లాసులు పీకడం మోదీకి కొత్త కాకపోయినప్పటికీ.. ఈ సారి కాస్త డోస్ పెంచారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Advertisements
చిన్న పిల్లలకు చెప్పినట్టు ప్రతిసారి చెప్పాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారట. ప్రవర్తనలో మార్పు రాకపోతే.. కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయని ప్రధాని మోదీ.. ఎంపీలకు హెచ్చరించారట.