ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండగా, ఇండియాలోనూ వ్యాక్సినేషన్ కోసం ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. దేశంలో కరోనా వైరస్ ఉత్పత్తి చేస్తూ, ఫేజ్-3 ట్రయల్స్ లో సక్సెస్ ఫుల్ గా ఉన్న సంస్థలను మోడీ స్వయంగా పరిశీలించనున్నారు.
టీకా అభివృద్ధిలో ముందున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను ప్రధాని స్వయంగా సందర్శించనున్నారు. మొదట హైదరాబాద్ లో భారత్ బయోటెక్ సంస్థను ఆ తర్వాత నేరుగా పుణే వెళ్లి అక్కడ సీరం సంస్థలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. పుణే నుండి ప్రధాని నేరుగా గుజరాత్ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ జైడస్ క్యాడిల సంస్థలో వ్యాక్సిన్ ఉత్పత్తి, వ్యాక్సిన్ పనితీరును ఆయన పర్యవేక్షించనున్నారు.
ఈ సంస్థల్లో సీరం ఆద్వర్యంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ జనవరి మొదటి వారానికే 10కోట్ల డోసులు రెడీ అయ్యే అవకాశం ఉంది. పైగా ఈ కంపెనీలన్నీ అత్యవసర వ్యాక్సినేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారింది.