తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టేందుకు వందే భారత్ రైలు రెడీ అయింది. సికింద్రబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడకు రైలు నడవనుంది. జనవరి 19న వందే భారత్ రైలును ప్రధాని మోడీ సికింద్రబాద్‌లో ప్రారంభించనున్నారు.
వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. దీంతో పాటు కాజీపేట వర్క్ షాప్, సికింద్రబాద్ స్టేషన్ పునరాభివృద్ది, సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హై టెక్నాలజీ హంగులతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. గంటలకు 160 కిలో మీటర్ల వేగతంలో ఈ వందేభారత్ రైలు వెళ్లగలదు. కేవలం రెండు నిమిషాల్లో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.
ఈ రైలు రాకతో సికింద్రబాద్-విజయవాడల మధ్య ప్రయాణ సమయం తగ్గనున్నది. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి కాజీపేట మీదుగా ఉండగా, రెండోది నల్గొండ మీదుగా ఉంది.