ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.” ఢిల్లీ ప్రజలారా…ముఖ్యంగా నా యువ మిత్రులారా..ఓటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొనండి” అని ప్రధాన మంత్రి సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 నియోజకవర్గాల్లో బీజేపీ మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రచారమంతా ప్రధాన మంత్రి మోదీ విధానాలపైనే సాగింది. ఢిల్లీ తమ చేజిక్కించుకోవడం కోసం బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. పార్టీకి చెందిన 41 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించి ప్రచారం చేసింది. దేశ రాజధాని ఢిల్లీని తమ చేతిలోకి తెచ్చుకోవడానికి శాయశక్తులొడ్డింది. ముఖ్యంగా హిందూత్వ, యువ ఓటర్లనే నమ్ముకుంది. అయితే ఢిల్లీ ఓటర్లు ఏం తీర్పు నిస్తారనేది వేచి చూడాల్సిందే.