పౌరసత్వ చట్టంలో ముస్లింలపై వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ చేసే ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ, దేశ విభజన, 1975 ఎమర్జెన్సీ, 1984 సిక్కుల అల్లర్ల అంశాలను ప్రస్తావించారు. పౌరసత్వ చట్టంపై నిరసనలకు ప్రజలను రెచ్చగొడుతున్నారని నిందిస్తూ కాంగ్రెస్, వామపక్షాలను నిందిస్తూ….చట్టంతో భారతీయులు, మైనార్టీల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదని పునరుద్ఘాటించారు.
లోక్ సభలో రాష్రపతి ప్రసంగంపై చర్చ సందర్బంగా ప్రధాన మంత్రి సమాధానమిస్తూ…మన జాతి నిర్మాతల కలలను సాకారం చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ సమస్యలు సృష్టిస్తుంది. విభజన అనంతరం పాకిస్థాన్ లోని మైనార్టీల కోసం మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడో ప్రధాని వివరించాడు. ” ఇండియాకు ప్రధాన మంత్రి కావాలనే ఒకరి కోరిక మేరకు ఇండియా మ్యాప్ లో గీత గీసి రెండుగా విభజించారు. విభజన తర్వాత పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీలను ఊహించని రీతిలో హింసించారు.
1950 లో నెహ్రూ-లియాఖత్ అలీ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ లో మైనార్టీలపై ఎలాంటి వివక్ష ఉండదని ఉంది. ” నెహ్రూ లాంటి ఒక పెద్ద సెక్యులరిస్ట్…పెద్ద దార్శనికుడు…ఆయన మీరు అనుకునే అన్నీ…అలాంటి వ్యక్తి మైనార్టీలు అనకుండా పౌరులందరికీ అని ఎందుకు ఒప్పందంలో చేర్చలేదు..? దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది” అంటూ కాంగ్రెస్ ను విమర్శించారు.
విభజన తర్వాత ఇరు దేశాల్లోని మైనార్టీల వలసలకు సంబంధించిన అంశంపై నాటి ఇండియా-పాకిస్థాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు-లియాఖత్ అలీల మధ్య ఒప్పందం జరిగింది.హిందూ శరణార్దులను, ముస్లిం వలసదారులను వేర్వేరుగా చూడమంటూ నెహ్రూ అస్సాం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తూర్పు పాకిస్థాన్ లో అధికారులు హిందువులపై ఒత్తిడి తెస్తున్నట్టు 1953 లో నెహ్రూ లోక్ సభలో చెప్పారు. తన దగ్గర డాక్యుమెంట్లున్నాయి. వీటన్నింటితో నెహ్రూ మతోన్మాదా..? నాకు తెలుసు కోవాలనుంది..? హిందూ, ముస్లింలను వివక్ష చూపారా..? ఆయన హిందూ దేశం కోరుకున్నారా అంటూ కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు.