కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచం మొత్తం పోరాడుతుంది. అగ్రరాజ్యం అమెరికా మొదలు పసికూన దేశాల వరకు అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ఉత్పత్తి రంగం దాదాపు మూతపడింది. నిర్మాణ రంగం కుదేలయింది. ప్రపంచ ఆర్థిక మార్కెట్లు గతంలో ఎప్పుడూ చూడని అదమ స్థితికి దిగజరిపోయాయి. దింతో ఆయా దేశాలు నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు తమ దేశాల పౌరులను కాపాడుకునేందుకు ఓ వైపు వైద్య పరంగా, మరోవైపు వారికి అండగా ఉండేందుకు చర్యలు చేపట్టాయి.
అయితే ఇక్కడే ప్రధాని మోడీ ఎందుకు వెనకపడ్డారు అన్న ప్రశ్న అందరిని వేధిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్… తమ దేశ పౌరులను ఆదుకునేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించారు. అమెరికాలో పౌరసత్వం ఉన్నవారితో పాటు అమెరికాలో ఉంటూ పన్నులు కట్టే వారికి నష్ట నివారణ చర్యగా ఒక్కొక్కరికి1200 అమెరికన్ డాలర్లు ప్రకటించారు. అంటే అమెరికా జనాభాలో చూస్తే… ప్రతి ఒక్కరు లక్ష రూపాయలకు పైగా పొందుతారు. కరోనా నుండి బయటపడి వరకు ఇది ఉపశమనం కలుగుతుంది అని ట్రంప్ సర్కార్ యోచన.
కానీ భారత ప్రధాని మోడీ 21రోజుల లాక్ డౌన్ అయితే ప్రకటించారు కానీ నష్టపోతున్న వారిని కానీ, రోజువారీ కూలీ చేసుకొని బ్రతికే వారిని కనీసం అడ్రస్ చేయలేదు. ఇక కరోనా వైరస్ పై పోరాటం కోసం, వైద్య పరికరాల కోసం 15వేల కోట్లు కేటాయించారు. అంటే భారత జనాభాలో చూస్తే… ప్రతి మనిషికి 115 రూపాయలు మాత్రమే. భారతీయుల బ్రతుకు మరీ ఇంత ఘోరమ అని కొందరు, మోడీ ఎందుకు వెనకపడ్డాడు అని మరికొందరు ఇదే విషయం పై ప్రశ్నిస్తున్నారు. అయితే… అమెరికాకు, ఇండియాకు తేడా లేదా, ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వారు నడుస్తారు అని అనే వాళ్ళు కూడా లేకపోలేదు.