భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితగాథను ఆధారంగా చేసుకుని బయోపిక్ రూపొందుతున్న ‘మన్ బైరాగి’ ఫస్ట్ లుక్ అదిరింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందీలో మన్ బైరాగి అనే టైటిల్ ఖరారు కాగా, తెలుగులో ‘మనో విరాగి’ అనే పేరు ఫైనల్ చేశారు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో ‘మన్ బైరాగి’ బయోపిక్‌ను సంజయ్ లీలా భన్సాలి, మహావీర్ జైన్ నిర్మిస్తున్నారు.
నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను యంగ్ రెబల్‌స్టార్ విడుదల చేశారు. మన్ బైరాగి హిందీ, తెలుగు వెర్షన్ల పోస్టర్లను ప్రభాస్ తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. ప్రత్యేకమైన వ్యక్తిపై రూపొందుతోన్న ప్రత్యేకమైన సినిమా ఇది అని.. మోదీ జన్మదినం సందర్భంగా ఈ స్పెషల్ డే రోజున ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామని ఫిలిమ్ మేకర్స్ అనౌన్స్ చేశారు. హ్యాపీ బర్త్ డే నరేంద్రమోడీ గారు.. అంటూ ప్రభాస్ ట్వీట్ చేశారు. మన్ బైరాగి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నరేంద్ర మోదీగారి జీవితానికి సంబంధించిన అన్‌టోల్డ్ స్టోరీ సంజయ్ త్రిపాఠి డైరెక్షన్‌లో వస్తోందని ప్రభాస్ పోస్ట్ చేశారు.