
భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు శాల్యూట్ చేస్తున్నానని ప్రధాని అన్నారు. శాస్త్రవేత్తల బాధను తానూ పంచుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు. దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించతగినదని అన్నారు. చంద్రుడికి మనం దగ్గరగా వెళ్లామని.. భవిష్యత్‌లో మనం మరిన్ని ప్రయోగాలు చేయాలని అన్నారు.
ఇది ఎంత మాత్రం వెనుకడుగు కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని మోదీ చెప్పారు. ‘మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయి. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతాయి. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుంది. సాధించిన ఫలితాలతోపాటు… సాగించిన కృషి కూడా గుర్తించాలి’ అని మోడీ అన్నారు. చంద్రయాన్-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నం చేశారని ప్రసంశించారు. ‘సైన్స్‌లో ఫెయిల్యూర్ అనే మాటే లేదు.. మన విజయాలకు భారీ కొలమానాలు పెట్టుకోవాలి..’ అని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను ఊరడించారు.
https://youtu.be/OMw-nI_75QE