ప్రధాని మోదీ అధికారులకు షాక్ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత గురువు గురు తేజ్ బహదూర్‌కు నివాళులర్పించారు. షెడ్యూల్‌లో లేని పర్యటన కావడంతో అధికారులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. సాధారణం ట్రాఫిక్ లో గురుద్వారాకు వెళ్లారు. ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన మోదీని చూసి.. అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
గురుద్వారా సందర్శించి విషయాన్ని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. గురు తేజ్ బహదూర్ జీవితం ధైర్యం, కరుణకు ప్రతిరూపం. సమ్మిళిత సమాజం కోసం ఆయన అమరుడయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పర్వ్ రావడం ఆయన దీవెనగా భావిస్తున్నానంటూ మోదీ ట్విట్ చేశారు.