ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 6 వందల కోట్ల ఖర్చుతో కూడిన గ్రౌండ్ వాటర్ మేనేజ్ మెంట్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. అటల్ భుజల్ యోజన అనే ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఇప్పిటకే ఆమోదం తెలిపింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్ పేయ్ 95 వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నీటిపారుదల ప్రాంతంలో 65 శాతం భూగర్భజలాలేనని ప్రధాన మంత్రి అన్నారు. 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తారు. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ని కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. 78 జిల్లాల్లోని 8350 గ్రామ పంచాయతీలు ఈ పథకం వల్ల లాభం పొందనున్నాయి.
పథకం ప్రారంభానికి ముందు నరేంద్ర మోదీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ కి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్ పేయ్ లేని నిశబ్ధం ఆయన మాటల కంటే శక్తివంతగా ఉందని అన్నారు. అటల్ జీ గురించి చాలా విషయాలు చెప్పవచ్చు. ఎప్పుడు నిశబ్ధంగా ఉండాలో…ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..ప్రధాన మంత్రి, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు నేతలు బుధవారం ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్ దగ్గర నివాళులర్పించారు.